![]() |
| Child Health Tips |
మీ పిల్లల మేని ఛాయ తక్కువగా ఉందని చింతిస్తున్నారా. వారి పసితనం నుంచి కాస్త ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే ఈ సమస్యను ఇట్టే అధిగమించవచ్చు. పెద్దలు సున్నిపిండితో పిల్లలకు స్నానం చేయించడం ఇందులో భాగమే. మీ చిన్నారులు బంగారు ఛాయలో మెరిసిపోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.
- స్నానం దగ్గర మనం తీసుకునే జాగ్రత్తలు పిల్లల మేని ఛాయ మెరిసిపోయేందుకు దోహదం చేస్తాయి స్నానానికి ముందు నువ్వుల నూనెతో మర్దనా చేయడం, నలుగు పెట్టి స్నానం చేయించడం చర్మ కాంతి ద్విగుణీకృతం అవుతుంది మర్దనా చేయడం చిన్నారుల ఎదుగుదలకు దోహదం చేస్తుంది.
- నిమ్మరసంలో ఉండే విటమిన్-సి రంగు మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది పిల్లలకు నిమ్మరసం కలిపిన నీటిని అప్పుడప్పుడూ తాగించడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది.
- తేనె తీసుకోవడం కూడా మేని ఛాయకు మేలు చేస్తుంది తేనెలో ఉండే విటమిన్ బి కాంప్లెక్సు చర్మం రంగును మెరిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
- కొబ్బరి నీటితో ముఖం, శరీరాన్ని మర్దనా చేయడం వల్ల మంచి రంగు వస్తుంది.
- సాధారణంగా పళ్లు ఎక్కువగా తినడం ఆరోగ్యానికే కాదు అందానికీ మంచిది కాస్త పెద్దపిల్లల్లో చర్మం పాలరంగు సంతరించుకోవాలంటే బొప్పాయి, అనాస పళ్లు తరచూ తినిపిస్తుండాలి.
- టీనేజ్ పిల్లలకు చర్మ సంబంధమైన సమస్యలు పెరుగుతుంటాయి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి కావడమే ఇందుకు కారణం పోషక విలువులు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
- పిల్లలు ఎండలో వెళ్లినపుడు సన్‌స్ర్కీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకునేలా చూడండి గొడుగు, టోపి ధరించడం అలవాటు చేయండి.
- ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ పాలపొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె, సగం నిమ్మకాయ రసం కలిపి మిశ్రమంగా చేసుకుని ముఖానికి రాసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే ముఖంపై పేరుకుపోయిన దుమ్ము తొలిగిపోతుంది.

Comments
Post a Comment