![]() |
| ఉదయాన్నే కాఫీ..ఆరోగ్యం మాఫీ.. |
ఉదయం పడకమీద నుంచి లేవగానే పరగడుపున కాఫీ పడితేనే కాని కొందరికీ నిద్రపట్టదు ఓ కప్పు కాఫీ తాగాకే మిగతా పనులు ప్రారంభిస్తారు. అయితే, ఉదయాన్నే కాఫీ తాగటం వలన ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యనిపుణులు చెప్తున్నారు. కడుపులో ఏదైనా వేసుకున్నాకే కాఫీ తాగాలని లేదంటే… అనారోగ్యం కలుగుతుందని ఇటీవల పరిశోధనలో తేలింది. మాములుగా కాఫీ తాగటం వలన ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని, కాకపొతే కాఫీని పరగడుపున తీసుకుంటే ప్రయోజనాలకంటే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయని వారు చెప్తున్నారు. ఉదయాన్నే కొందరిలో కార్టిసాల్ విడుదల ఎక్కువగా ఉంటుందని అటువంటి వారికి కాఫీ తీసుకోవడం వలన అనారోగ్యం సంభవించే అవకాశం అధికంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. యూట్యూబ్ సైన్స్ చానల్ ఏఎస్ ఏపీ సైన్స్ కొంతమందిపై పరిశోధనలు చేసింది. ఆ పరిశోధనలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఉన్న సమయంలో మాత్రమే కాఫీ తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. పదిగంటల లోపు అలాగే సాయంత్రం ఐదు తరువాత కాఫీ తాగకపోవడమే ఉత్తమం అని వారి పరిశోధనలో తేలింది.

Comments
Post a Comment