వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి...

వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి...


రుతుపవనాలు విస్తరిస్తుండటంతో చిరుజల్లులు మొదలయ్యాయి. ఈ సీజన్లో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. చలికాలంలో దాహం వేయలేదని కొంత మంది నీరు త్రాగడమే మానేస్తారు. దాంతో శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. అలా జరకుండా శరీరంను ఎప్పుడూ తేమగా ఉంచుకోవడానికి, ఇన్ఫెక్షన్స్ బారి నుంచి తప్పించుకోవాలంటే నీరు ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అది కూడా నీటిని బాగా మరిగించి, వడపోసి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారాలు అంట్లే ఇడ్లీ వంటివి ఆరోగ్యానికి ఉత్తమం. వర్షాకాలంలో ఆయిల్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్ను తినడం నివారించాలి. గ్రిల్డ్ చేసిన ఆహారాలను మితంగా తీసుకోవడం మంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉత్తమం. వేసవి కాలంలోనే కాదు, ఫ్రెష్ జ్యూసులకు వర్షాకాలంలో కూడా మంచిదే. శరీరానికి తగిన హైడ్రేషన్ అందివ్వడానికి తాజా పండ్లు, కూరగాయలతో తయారుచేసిన జ్యూసులను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా పండ్లలో వ్యాధినిరోధకతను పెంచేవాటిని ఎక్కువగా ఎంచుకోవాలి. వర్షాకాలంలో వ్యాధినిరోథకను పెంచే విటమిన్ సి ఫుడ్స్ను ఎక్కువగా తీసుకోవాలి. అలాంటి వాటిలో దానిమ్మ, కివి, ఆరెంజ్లు ఉత్తమం. జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లైతే నీటి శాతం అధికంగా ఉండే ఫ్రూట్స్ను తినకుండా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Comments