పుష్కర స్నానం ఇలా చేస్తే పుణ్యం.

పవిత్ర గోదావరి పుష్కరాలు వచ్చేశాయ్.. ఎనిమిది లక్షల మందికి పైగా ఈ పుష్కరాల్లో  పవిత్ర స్నానాలు ఆచరిస్తారనే అంచన. ఇంత పెద్ద ఉత్సవం లో కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పవిత్ర పుష్కరాల్లో స్నానాలు ఆచరించే భక్తులారా ఓసారి ఆలోచిద్దాం! పుణ్యం పేరుతో మనం ఏ పాపాన్ని చేయకుండా, గోదారమ్మ పవిత్రతకు భంగం కలగకుండా, ప్రకృతి తల్లికి మేలు జరిగేలా మనం కొన్ని పనులను చేద్దాం. - See more at: http://telugu.ap2tg.com/news/godavari-pushkaralu-kumbhamela/#sthash.KgKSn05W.dpuf
గోదావరి పుష్కరాలు
పవిత్ర గోదావరి పుష్కరాలు వచ్చేశాయ్.. ఎనిమిది లక్షల మందికి పైగా ఈ పుష్కరాల్లో  పవిత్ర స్నానాలు ఆచరిస్తారనే అంచన. ఇంత పెద్ద ఉత్సవం లో కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పవిత్ర పుష్కరాల్లో స్నానాలు ఆచరించే భక్తులారా ఓసారి ఆలోచిద్దాం పుణ్యం పేరుతో మనం ఏ పాపాన్ని చేయకుండా, గోదారమ్మ పవిత్రతకు భంగం కలగకుండా, ప్రకృతి తల్లికి మేలు జరిగేలా మనం కొన్ని పనులను చేద్దాం.

పుష్కర స్నానం చేసే ముందు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవల్సిన విషయం...

పరమ శివుని యొక్క మూడవ కంటి మంట నుంచి ఒక కృచ్చ పుట్టింది. ఆ కృచ్చ నాకు ఆకలి వేస్తోంది ఏమి తినమంటావు అని శివుని అడిగింది అడిగితే ఆయన అన్నారు.. పుష్కరాల్లో స్నానం చేసి పాపాలను పోగొట్టు కోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు నదుల దగ్గరకి వస్తారు. వాళ్ళు స్నానం చేసి బయటకి రాగానే వాళ్ళకి అపారమైన పుణ్య రాశి వస్తుంది. కాని పుష్కర స్నానం చేసేప్పుడు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టి నదిలోకి విసిరి ఒక మంత్రం

"పిప్పలాదాత్ సముత్పన్న
కృత్యే లోకభయంకరీ
మృత్తికాంతే వయాదత్తా
మహారార్ధం ప్రకల్పయా "

అని మంత్రం చెప్పకుండా, మట్టి విసరకుండా ఎవరు నీటి నుండి స్నానం చేసి బయటకు వస్తారో వాళ్ళ యొక్క పుణ్యాన్ని నువ్వు తినేయి అని ఆనతి ఇచ్చారు. అందుకని పుష్కర స్నానం చేసిన వారి పుణ్యాన్ని కృచ్చి తినేస్తుంది. అందుకని కష్టపడి పుష్కర స్నానం కోసం వెళ్ళేది మన పాపరాశి దగ్ధం చేసుకోవటానికి కాబట్టి...

(పుష్కర స్నానం చేసేముందు గుప్పెడు మట్టి తీసుకుని నదిలో వేసి ఈ మంత్రం చెప్పిన తరువాత ఆ నదీమ తల్లి ఒడిలో పుణ్యస్నానమాచరించాలి).

ఇవి చేద్దాం:
  • మూడు సార్లు ఒడ్డు మీద  నుంచీ మట్టిని తీసి నదిలో వేసి అప్పుడు స్నానం చేయాలి.
  • ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి స్నానం చేయాలి.
  • ఆధునిక స్విమ్మింగ్ పూల్స్ లో ఏ విధమైన నియమాలను పాటిస్తామో వాటిని పుష్కర ఘాట్లలో కూడా పాటిద్దాం.
  • శాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర స్నానాలు చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలాలు లభిస్తాయి.
  • దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు తమవెంట మందులను తీసుకెళ్లండి.
  • చిన్న పిల్లలను జాగ్రత్తగా ఓ కంట కనిపెడుతుండండి.

ఇవి చెయ్యొద్దు:
  • నదీ స్నానం చేసేటప్పుడు  షాంపూ, సబ్బు వంటివి వాడరాదు. నూనె రాసుకోవడం, నలుగు పెట్టుకోవడం కూడా నిషేధం.
  • రాత్రి ధరించిన వస్త్రాలతో స్నానం చేయకూడదు.
  • స్నానం చేసిన తరువాత వస్త్రాలను నదిలో ఉతకడంగానీ … పిండటంగాని చేయకూడదు. బట్టల సబ్బు అసలు వాడరాదు.
  • అలాగే స్నానం చేసే సమయంలో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు.
  • పళ్లు తోముకోవడం, కాలకృత్యములు తీర్చు కోవడం వంటివి నదీ ప్రాంతాలలో చేయరాదు. నదులలో గుప్తప్రదేశాలు శుభ్రం చేసుకోరాదు.

Comments