తులసి అంటే సాటిలేనిది అని అర్థం


మూలికలలో మహారాణి తులసి. తులసి అనే సంస్కృత పదం. తులసి అంటే సాటిలేనిది అని అర్థం. "యన్మూలే సర్వతీర్థాని సన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్ " అని శాస్త్రాల్లో చెప్పబడింది.

తులసి మొక్క మధ్య భాగంలో అంటే కాండం నుంచి మస్త దేవీదేవతలు అగ్రభాగమందు నాల్గువేదాలు, మూలస్థానమందు సర్వతీర్థాలు నివాసముంటాయి. అటువంటి తులసికి నమస్కరిస్తున్నానన్నదే పై శ్లోకం అర్థం.

మన జీవన విధానానికి ప్రకృతి ఆలంబన. ప్రకృతిలో ముడిపడి సాగే జీవనసరళిలోని పురాణగాథలలో అంతర్లీనంగా ఎన్నో వైజ్ఞానిక అంశాలు ఉన్నాయి. పురాణగాథలో ముడిపడిన జీవనశైలిలోని ఆచార వ్యవహారాలన్నీ మానవ జీవన వికాసానికి తోడ్పడతాయి.



తులసిలో మనకు తెలిసిన కృష్ణతులసి, లక్ష్మితులసితో పాటు రామతులసి, అడవితులసి, నేలతులసి, మరువకతులసి, రుద్రజడతులసి, కర్పూరతులసి ఇలా ఎన్నో రకాలున్నాయి. కర్పూరతులసి తైలాన్ని ఓషధీయుత టాయ్లెట్స్ సాధనాల తయారీలో విరివిగా వాడతారు. నూనెను చెవినొప్పికి, క్రిమికీటకాలు, బ్యాక్టీరియాను నిరోధించడానికి ఎక్కువగా వాడతారు.

శ్వాస అవరోధ రుగ్మతలను నయం చేయడానికి రామతులసిని ముందుగా వాడతారు. మలేరియాను రామతులసి నయం చేస్తుంది. అజీర్ణం, తలనొప్పి, హిస్టీరియా, నిద్రలేమి, కలరా వంటివి నయం చేయడానికి తులసిలో మందు ఉంది. రుగ్మతల్ని నయం చేసే గుణాలుగల తులసి మూలికల్లో మహారాణిగా శతబ్దాల తరబడి ప్రసిద్ధి గాంచినది.

దేవునికి నమస్కారం పెట్టుకోవాలంటే ఆయనకు ఎదురుగా నమస్కారం పెట్టుకోకూడదన్నది నూరుపాళ్ళు నిజం.
జగత్తును పాలించే భగవంతున్ని దర్శించాలనే ఒక ప్రక్కగా నిలబడి ఎంతో వినయంగా భక్తితో నమస్కరించాలి.అంతే తప్ప పరమేశ్వరుని ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు.

దేవాలయాల్లో కూడా ఇందుకు తగినట్లుగానే ఏర్పాటు చేయటం మీరు గమనించవచ్చు. దేవునికి ఎదురుగా నిల్చొని నమస్కరించ కూడదని వేదం చెప్తోంది.

మీరు ఎప్పుడైనా విగ్రహ ప్రతిష్ట జరుగుతునప్పుడు చూసారా విగ్రహ ప్రతిష్ట జరిగే రోజున విగ్రహం కనులకు మైనం పెడతారు .విగ్రహం ప్రతిష్ట జరిగాక దేవుని విగ్రహనికి పెట్టిన మైనాన్ని తొలగింహగానే స్వామి వారి ద్రుష్టి మొదట ఆవు దూడ పై పడేలా ఏర్పాటు చేస్తారు. తర్వాత స్వామి వారు తన రూపం తను అద్దం లో చూసుకోనేల చేస్తారు.అటు పిమ్మట స్వామి వారికి మహా నివేదన ఏర్పాటు చేసి అయన ద్రుష్టి ఆహరం మీద పడేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది.దీని అర్థం ఏమిటంటే గుడిలో ఉన్న స్వామి వారి ద్రుష్టి సరాసరి ధ్వజస్తంబం క్రింద ఉన్న దైవం మీద పడాలి.వారిదరి మద్య ఎవ్వరు నిలబదకూడదు.

విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజునే కాదు ... రోజునైన స్వామి వారికి అయన వాహనానికి మద్యన ఎవ్వరు కూడా నిలబడకూడదు.అందువలనే దేవుని ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టుకోకుడదని అంటారు.ఒక ప్రక్కగా నిలబడి దేవునికి వినయంతో చేతులు జోడించి దణ్ణం పెట్టుకోవాలి. భక్తితో మీ మనసులోని కోరికలని విన్నవించుకోవాలి.మిగతా దేవుల్లందరికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు కాని శని దేవుణ్ణి మాత్రం ప్రక్కనుంచి చూడకూడదు.శనికి ఎదురుగా వెళ్లి నమస్కారం చేసి ప్రక్కకు వెళ్లిపోవాలి.

Comments