గ్రీన్ టీ(Green Tea) అద్భుతాలు

Health Tips
చైనా లో పుట్టిన ఈ గ్రీన్ టీ ఈ మధ్యనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించుకుంది. అతి తక్కువగా ఫెర్మెన్ట్ చేయబడ్డ టీ ఆకులు ఇవి.


గ్రీన్ టీ కూడా చాలా వరైటీలు ఇప్పుడు లభ్యమౌతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వైద్య పరమైన రీసర్చ్ లు, ప్రయోగాల వల్ల గ్రీన్ టీకు సంబంధించిన ఎన్నో ప్రయోజనాలూ, ఉపయోగాలూ కనుగొనబడ్డాయి.

గ్రీన్ టీ తాగటo వల్ల చేకూరే ఆరోగ్యపరమైన కొన్ని ఉపయోగాలు:
గ్రీన్ టీలో EGCG (Epigallocatechin Gallate) అనే శక్తివంతమైన anti-oxident ఉంది. (anti-oxidents శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కాపాడతాయి) 


***

రెగులర్ గా గ్రీన్ టీ త్రాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి.
***

కొన్నిరకాల కేన్సర్లను రాకుండా నివారించగలిగే శక్తి ఈ టీ లో ఉంది.
***

అధిక బరువును తగ్గిస్తుంది.
***

రోజూ గ్రీన్ టీ తాగటం వల్ల అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
***

బేక్టీరియాను నివారించే సామర్ధ్యం ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ ను రానివ్వకుండా చేయటమే కాక పళ్ళ ను కూడా సురక్షితంగా ఉంచగలుగే శక్తి
గ్రీన్ టీకు ఉంది.
***



గ్రీన్ టీ తయారీ:....................
***
ఒక కప్పు నీళ్ళు బాగా మరగబెట్టి దింపుకోవాలి.
***
తరువాత ఒక చిన్న చెంచాడు గ్రీన్ టీ ఆకులను అందులో వేసి 1,2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
***
ఫ్లేవర్ కోసం ఆకులతో బాటుగా పావు చెంచా నిమ్మరసం, పంచదార బదులు తేనె కలుపుకుంటే ఆరోగ్యకరం.
***
రెండు నిమిషాల తరువాత వడబోసుకుని త్రాగేయటమే..!
***

ఫ్లేవర్స్:-..................
***
నిమ్మరసంతో బాటుగా రెండు మూడు పుదీనా ఆకులను కూడా వేసుకుంటే అమోఘంగా ఉంటుంది.
***
నిమ్మరసంతో పుదీనాకు బదులు చిన్న అల్లం ముక్క తొక్కి వేసుకున్నా బాగుంటుంది.
***
నిమ్మరసం వాడకపోయినా పుదీనాకు బదులు నాలుగు తులసి ఆకులు కూడా వాడవచ్చు.


COURTESY:www.facebook.com/pages/చందమామ-కథలు

Comments