రొమాంటిక్‌ ఫుడ్‌

Health Tips

* రొమాంటిక్‌ ఫుడ్‌
ఆడ, మగ మధ్య బంధానికి ముడివేసే శక్తి దాంపత్య జీవితానికుంది. అది సరిగా లేకుంటే ఇద్దరి నడుమ బంధం పల్చబడుతూ వస్తుంది. పడగ్గదిలో భార్యాభర్తలకు మాంచి రొమాంటిక్‌ మూడ్‌ రావాలంటే వీటిని తినాలి. ఇక శృంగారానికి హద్దే ఉండదు.
• వాల్‌నట్స్‌
శృంగార వాంఛలను రగిలించడంలో వీటి పాత్ర అమోఘం. వీర్యకణాల వృద్ధికి వాల్‌నట్స్‌ తోడ్పడతాయి. ఇందులోని ఔషధగుణాలు సంతానసాఫల్యానికి ఉపకరిస్తాయని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
• స్ట్రాబెర్రీలు
శృంగార భావోద్వేగాలు సహజంగా ఉండాలంటే.. శరీరానికి తగినంత జింక్‌ అవసరం. భార్యాభర్తలిద్దరూ జింక్‌ కలిగిన ఆహారపదార్థాలను, పండ్లను తీసుకోవాలి. ఆ కోణంలో స్ట్రాబెర్రీ బెటర్‌. ఈ పండ్లలో జింక్‌ అధికం. టెస్టోస్టిరాన్‌ స్థాయిని నియంత్రించే శక్తి జింక్‌కు ఉంది.
• పుచ్చకాయ
దాంపత్యజీవితాన్ని మరింత సుఖమయం చేసే శక్తి పుచ్చకాయకు కూడా ఉంది. ఈ పండులోని అమినో ఆసిడ్స్‌ నరాల్లోని అడ్డంకుల్ని తొలగించి.. రక్తసరఫరా సాఫీగా జరిగేలా చేస్తాయి. తద్వార పడగ్గది మరింత పసందుగా మారిపోతుంది.
• డార్క్‌ చాకొలెట్‌
పడగ్గది మూడ్‌ను మార్చేయడంలో సెరొటోనిన్‌, ఎండార్ఫిన్‌ అనే ఎంజైమ్‌లు అవసరం. ఈ రెండు ఎంజైమ్‌లు కావాలంటే డార్క్‌ చాకొలేట్‌ను తినాలి. అప్పుడప్పుడు ఈ చాకొలేట్‌ను తింటే మంచి మూడ్‌ వచ్చేస్తుంది.
• కుంకుమపువ్వు
అవసరమైనప్పుడు కాకుండా రెగ్యులర్‌గా కుంకుమపువ్వును ఆహారపదార్థాలలో వాడటం అలవాటు చేసుకోవాలి. దాంపత్యజీవిత సామర్థ్యాన్ని, అందుకు కావాల్సిన శక్తిని అందిస్తుంది.
• కోడిగుడ్లు
ఉడికించిన కోడిగుడ్లకు కూడా శృంగార భావనలను ప్రేరేపించే గుణాలు ఉన్నాయి. రోజు మార్చి రోజు అయినా తప్పకుండా ఎగ్స్‌ను తీసుకోవడం ఉత్తమం.
• బాదాం
రక్తసరఫరా సాఫీగా సాగించి.. రక్తనాళాలకు ఉపశమనం కలిగించడంలో బాదాం పప్పు ఎంతో సాయపడుతుంది. ఆల్మండ్స్‌లో కూడా అమినో ఆసిడ్స్‌ అధికం. కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు బాదాంను తరచూ తీసుకుంటే మంచిది.

Comments