రాత్రిపూట పెరుగు తినొచ్చా?

Health Tips In Telugu
అసలే ఎండాకాలం.. ఈ కాలంలో పెరుగన్నం తింటే శరీరానికి వచ్చే చల్లదనమే వేరు. మన జీర్ణక్రియని సాఫీగా ఉంచుతుంది. అందుకే చాలా మంది రోజూ పెరుగుని ఆహారంగా తీసుకోవటానికి ఇష్టపడతారు. అయితే రాత్రిపూట పెరుగుని తీసుకోవడం మంచిదేనా?
చాలా మంది రాత్రిపూట పెరుగును తీసుకోవద్దనే చెబుతుంటారు. అందరికీ ఈ నియమం వర్తిస్తుందా అంటే కాదనే సమాధానం వస్తోంది. ముఖ్యంగా దగ్గు, జలుబు ఉన్నవారు రాత్రిపూట పెరుగుకి దూరంగా ఉండటం మంచిది. ఇలాంటి వారు ఏముందిలే అని పెరుగు తాగితే శ్లేష్మము, చీమిడి, గళ్ళతో బాధపడతారని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే జలుబు, దగ్గుతో బాధపడే వారు మజ్జిగని తాగటం మంచిది.
పగటిపూట పెరుగుని తింటే అందులో చక్కెర వేసుకోకూడదు. అయితే రాత్రిపూట పెరుగు తాగాలనుకుంటే అందులో షుగర్‌ లేదా మిరియాల పొడిని కలిపి తాగాలి. ఇక గట్టి పెరుగును డైరెక్ట్‌గా తీసుకోవద్దు.. అందులో కాస్త మంచి నీళ్లు పోసుకోవాలనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోవద్దు.

* నిజంగా మీరు పెరుగు ప్రేమికులైతే రాత్రి పూట పెరుగుని ఇలా తీసుకోండి.

• ఎప్పుడైనా సరే పెరుగన్నం తినటం ఆరోగ్యానికి చాలా మంచిది.

• పెరుగుకి కాస్త ఉప్పు కలిపి మజ్జిగ చేసుకొని తాగాలి.

• లస్సీ చేసుకుని తాగవచ్చు.

• పెరుగులోకి టమోటో, ఉల్లిపాయలు, కొత్తిమీర వంటి కాయగూరల్ని వేసి పెరుగుచట్నీ చేసుకుని అన్నంలో తినొచ్చు.

• మజ్జిగ చారు తాగటం ఎండాకాలం శ్రేష్టం.

Comments

Post a Comment