శ్రీ కాళహస్తి రైల్వే స్టేషన్నుంచి ఆలయం కూడా దగ్గరే ,బయట ఆలయం వాళ్ళు ఏర్పాటుచేసిన ఉచిత బస్సు మరియు షేర్ ఆటో లో కూడా ఉన్నాయి .. శ్రీ కాళహస్తి లో ఉన్న శివలింగం పంచభూతలింగాల్లో ఒకటైన వాయు లింగం . మీరు దర్శనం చేస్కునేటప్పుడు గమనిస్తే లింగానికి ఎదురుగ ఉన్న దీపం స్వామి వారి నుంచి వస్తున్నా గాలికి దీపం ఊగుతూ కనిపిస్తుంది . అక్కడ ఉన్న పూజారులు మీకు చెబుతారు .. మరో విషయం ఏమిటంటే మనం అక్కడ ఇతర కోరికలు ఏమి కోరకూడదు అని పెద్దలు చెబుతారు .. ఈ ఆలయం లో స్వామి వారి కంటే ముందే అమ్మవార్కి ఉదయాన్నే పూజలు ప్రారంభిస్తారు .. భక్తుడైన కనప్ప కొండపైన దేవుడు కొండ క్రింద ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తి . ముందుగా భక్త కన్నప్పను దర్శించుకుని తరువాత స్వామి వారని దర్శనం చేస్కోవాలి అని స్థలపురాణం .. స్వామి వారి ఆలయం నుంచి బయటకి వచ్చేటప్పుడు కుడివైపుకి వైపు కి మీరు వెళ్తే అక్కడ చోట నుంచి చూస్తే .. భక్తకన్నప్ప గుడి , అమ్మవారి గుడి , ఆలయ ద్వజస్థంబం కనిపిస్తాయి . అక్కడ ఉన్నవాళ్ళని అడగండి వాళ్ళు చూపిస్తారు . ఇక్కడ నుంచి తిరుపతికి రెగ్యులర్ గ బస్సు లు ఉంటాయి . ఆలయం బయట నిలబడితే అక్కడికే వచ్చి ఆగుతాయి సుమారు 1గం ॥ సమయం పడుతుంది .

Comments
Post a Comment