![]() |
| Temple Information |
బల్లి ఇంట తిరగాడుతున్నప్పటికీ.. అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుంచో ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా.. కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వలన ఆ దోషం పోతుందని చెప్పబడుతోంది.
కంచి ఆలయంలో బంగారు బల్లి ... వెండి బల్లి రూపాలు దర్శనమిస్తూ వుంటాయి. వాటిని తాకడం వలన అప్పుడప్పుడు బల్లిపడటం వలన కలిగిన దోషాలు తొలగిపోతాయని అంటారు. ఇలాంటి పద్ధతి మనకి 'దేవుని కడప'లోను కనిపిస్తుంది.
పౌరాణిక ... చారిత్రక నేపథ్యాలను కలిగిన 'లక్ష్మీ వేంకటేశ్వరస్వామి' క్షేత్రం ఇక్కడ దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి అమ్మవారి మందిరం 'పై కప్పు' కి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ... ఈ బల్లులను తాకుతుంటారు.
అప్పటి వరకూ బల్లులు మీద పడటం వలన దోషాలు ఏమైనా కలిగి వుంటే అవి తప్పకుండా నివారించబడుతాయని స్థలపురాణం చెబుతోంది

Comments
Post a Comment