![]() |
| Pregnant Woman Food |
గర్భిణీలు
తీసుకోవాల్సిన
ఆహారం
:
చాలామంది గర్భిణులు 'ఇద్దరి కోసం తినాలని' నమ్ముతూ దీన్నే ప్రచారం చేస్తుంటారు. కానీ వాస్తవానికి అతిగా తినటం వల్లే సమస్యలు తలెత్తుతాయి. ఇష్టంగా తినటం, బిడ్డకు కావాల్సినంత పోషకాలను అందించేలా తినటం ముఖ్యం. గర్భిణి తీసుకునే ఆహారం వారికి పుట్టే పిల్లలనూ ప్రభావితం చేస్తుందని అధ్యయనాల్లో గుర్తించారు. గర్భిణులు కొవ్వు పదార్ధాలు,
స్వీట్ల వంటివి
ఎక్కువగా తినటం
వల్ల వారికి
పుట్టే పిల్లలు
కూడా వాటి
పట్ల ఇష్టాన్ని
పెంచుకుంటారు. ఇది మంచిది కాదు. కాబట్టి గర్భిణి
ఆరోగ్యకరమైన పోషకాహారం
తీసుకోవటం తనకే
కాదు, పుట్టే
పిల్లలకూ మంచిది.
దీర్ఘకాలంలో ప్రభావం చూపే అంశం
ఇది. గర్భిణులు
మాంసకృత్తులు దండిగా
తీసుకోవాలి. అవసరమైతే
ప్రోటీన్ సప్లిమెంట్
అయినా తీసుకోవాలి.
గర్భిణులు ఉప్పు తగ్గించాల్సిన అవసరమూ లేదు.
More Updates Information Visit:

Comments
Post a Comment