![]() |
| Health Tips |
పోషకాలమయమైన మెంతికూర మహిళలకెంతో మేలు చేస్తుంది. కొందరికి నెలసరికి ముందూ, తరవాతా కడుపునొప్పీ, ఇతరత్రా అసౌకర్యాలూ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు వారంలో మూడునాలుగు సార్లు మెంతికూర తీసుకుంటే ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. మెంతి ఆకుల్లో ఇనుము అధికంగా ఉంటుంది. గర్భిణులు ఎంత తీసుకుంటే అంత మంచిది. శిశువు ఎదుగుదలలో ఇందులోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. బాలింతలు మెంతి కూర తినడం వల్ల పాల వృద్ధి బాగుంటుంది. మెనోపాజ్ సమయంలోనూ మెంతి కూర తినొచ్చు. ఆ సమయంలో వచ్చే మార్పులూ, హార్మోన్ల అసమతుల్యతను మెంతిలోని పోషకాలు క్రమబద్ధీకరిస్తాయి. ఒత్తిడినీ దూరం చేస్తాయి. నీరసం వంటి వాటిని పోగొట్టి తక్షణ శక్తినందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మెంతికూరను విటమిన్ సి సమృద్ధిగా లభించే టొమాటోలతో కలిపి వండితే శరీరం వాటి నుంచి అందే పోషకాలను చాలా త్వరగా గ్రహిస్తుంది.

Comments
Post a Comment