![]() |
| Health Tips |
ఆరోగ్యంగా ఉండాలంటే.. బ్రకోలీ తినాల్సిందే అంటున్నారు న్యూట్రీషన్లు. వారంలో ఒక్కరోజైనా బ్రకోలీ మెనూలో ఉండేలా చూసుకోవాలి. ఇది అధిక బరువును తగ్గిస్తుంది. ఇందులో విటమిన్స్, మినిరల్స్ క్యాలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉంటాయి. విటమిన్ ఎ.సి.కె.లు పుష్కలంగా ఉంటాయి.ఇది షుగర్ ని కుడా దరిచేరనివ్వదు, కోలన్ క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. ఒక కప్పు ఉడికించిన బ్రకోలీ ఒక రోజుకు శరీరానికి కావలసిన విటమిన్ సి, విటమిన్ కెని అందిస్తుంది. ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆహార పరిణామం తగ్గిపోతుంది. బరువు తగ్గడానికి మాత్రమే బ్రకోలీని తీసుకోవడం సరికాదు. ఇతర ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకోవాలి. ఉదాహరణకి నూడిల్స్‌కు బదులు ఉడికించిన బ్రకోలి సూప్‌ను తీసుకోవచ్చు. బ్రకోలీని ఉడికించి లేదా పచ్చిగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల పోషకాలు నశించకుండా ఉంటాయి. ఇన్ని ఉపయోగాలున్న బ్రకోలీని మీ మెనూలో కూడా చేర్చుకుంటారు కదూ..

Comments
Post a Comment