కాణిపాక క్షేత్రం
కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల
మండలంలో కాణిపాకం అనే
గ్రామంలో కొలువైవుంది.స్వామివారు ఇక్కడబావిలో స్వయంభూగా వెలిసాడు. ఇంచుమించు తిరుపతిని దర్శించిన ప్రతీ
భక్తుడు స్వామివారిని దర్శించుకుని వెళ్ళడం అనవాయితిగా వస్తుంది. ఈ
క్షేత్రం యొక్క
విశేషమేమిటంటే స్వామివారు కొలువైవున్న బావిలోనీరు భూభాగానికి సమానంగా ఉంటుంది. అదే
నీటిని
భక్తులకు తీర్ధం
కింద
ఇస్తారు ఇక్కడ
అర్చకులు. మరో
విశేషమేమిటంటే ఎపూడూ
నీళ్ళతో ఉండే
ఈ
బావిచుట్టూపక్కల ఉన్న
ప్రదేశంలో 40 అడుగుల
లోతు
తవ్వినా నీరు
దొరకదట.
స్వామివారి ఆలయాన్ని 11వ
శతాబ్దంలో చోళరాజు అయిన
కుల్తుంగ చోళుడు
నిర్మించాడని తెలుస్తుంది.
స్ధలపురాణం -
పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో మూగ, చెవిటి, గుడ్డి వారైన ముగ్గురు అన్నదమ్ములకు కాణి మడి ఉండేదట. అభూమిలో ఏతంతొక్కడానికి ఒక చిన్నబావిని తవ్వరట. అయితే కొంతకాలానికి ఆప్రాంతంలో కరువు రావడంతో నీరు చాలకపోవడంతో బావిని ఇంకాలోతుగా తవ్వాలని నిర్ణయించుకుని ముగ్గురూ కలిసి తవ్వడం ప్రారంభించారట. తవ్వగా తవ్వగా కొంతసేపటికి గునపం రయికి తగిలి ఉవ్వెత్తున రక్తం వారిమీద చిందిందట.ఆ రక్తం మీద పడగానే మూగ,గుడ్డి,చెవిటి వారైన ఆ అన్నదమ్ములకు వారి వైకల్యాలు పోయి మాములుగా తయారయ్యారట.ఈవార్త ఆప్రాంతం అంతా దావానంలా వ్యాపించి ప్రజలు తండోపతండాలుగా వచ్చి అక్కడ ఉన్న మట్టిని శుభ్రపరిచి చుడంగానే వారికి వినాయక విగ్రహం కనిపించిందట. దీనితో ఆ విగ్రహనికి ఆలయం నిర్మించారట. ఇప్పటికి స్వామి అంతరాలయం బావిలోనే ఉంటుంది.
COURTESY: teluguone.com

Comments
Post a Comment